మంచి సినిమాలు తీయండి: బండ్ల

35
- Advertisement -

కరోనా, లాక్ డౌన్ తర్వాత ఓటీటీల హవా పెరిగిపోగా థియేటర్లకు ప్రజలు పెద్దగా రావడం లేదు. దీనికి తోడు టికెట్ రేట్ల పెంపుతో సినీ పరిశ్రమలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు షూటింగ్‌లు ఆపేసి దీనికి పరిష్కారం చూపాలని కోరుతుండగా ఈ నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమా నా జీవితం. సినిమా నాకు ఇష్టమైన పదం. నేను సినిమా కోసమే బతుకుతున్నాను. ఈ మధ్య సినిమాలు ఆడటం లేదు, జనాలు థియేటర్స్‌కు రావడం లేదని కొంతమంది గోల చేసి గగ్గోలు పెడుతున్నారు. కానీ పరభాష హీరో వచ్చి ఇక్కడ సూపర్ హిట్ కొట్టాడు. అలాగే మిడిల్ రేంజ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్, చిన్న హీరో నిఖిల్ తమ సినిమాలతో సూపర్ హిట్ కొట్టారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే మంచి కథ ఉండి మంచి కథనంతో అద్భుతంగా తెరకెక్కిస్తే ఎప్పుడైనా, ఏ కాలంలోనైనా, ఏ సినిమానైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిపారు.

మనం బడ్జెట్లు పెంచుకుని వందల కోట్లు, వేల కోట్లతో సినిమాలు తీసి వంద కార్లు ఎగిరాయి, వంద టైర్లు ఎగిరాయి, చేతిలో హీరో ఓ రాడ్ పట్టుకుని వెనుక ఓ వంద మందిని పెట్టుకుని భమ్ అని లేపితే జనాలు వస్తారునుకోవడం తప్పు అని తెలిపారు. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారన్నారు.

- Advertisement -