అను ఆశలన్నీ ఆ సినిమాపైనే నట..!

362
Anu Emmanuel hopes Only Sailaja Reddy Alludu’ Movie
- Advertisement -

మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కథానాయిక అను ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి చిత్రం ఆమెకు మంచి క్రేజ్ తీసువచ్చింది. అయితే పవర్ స్టార్ తో జోడి కట్టి నటించిన ‘అజ్ఞాతవాసి‘ చిత్రంపై భారీ  ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రంతో అవకాశాలు పెరుగుతాయని భావించిన అనుకి, ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు నిరాశే మిగిలింది . అయితే మరో స్టార్ హీరో అల్లు అర్జున్ తో నటించిన నా పేర్య సూర్యతో తన దశ తిరిగుతుందని భావించిన అమ్మడుకు నిరాళే  ఎదురైంది. Anu Emmanuel hopes Only Sailaja Reddy Alludu’ Movie

స్టార్ హీరోలతో కలిసి నటించిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ అమ్మడు నిరాశ చెందిందని అంటున్నారు. తాజాగా నా పేరు సూర్య థ్యాంక్స్ మీట్ కి కూడా వెళ్లలేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు చెప్పినప్పటికీ… అసలు విషయం మాత్రం ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అప్సెట్ అయిందని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ అమ్మడు ‘శైలజా రెడ్డి అల్లుడు‘ సినిమాపైనే హోప్స్ పెట్టుకుందట. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోగా నాగచైతన్య చేస్తున్నారు. మరీ ఈ సినిమా అయిన అనుకి కలిసి వస్తుందో లేదో చూడాలి మరీ.

- Advertisement -