లోకనాయకుడు కమల్ …రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతకాలంగా వివిధ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరిపిన కమల్..రేపు అధికారికంగా పార్టీ పేరు,జెండా,ఎజెండాను ప్రకటించనున్నారు. మధురైలో భారీ బహిరంగసభలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
ఈ బహిరంగ సభకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్,బెంగాల్ సీఎం మమతా,కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు. ఇప్పటి వరకు పార్టీ జెండా,ఎజెండా విషయాలను చాలా గోప్యంగా ఉంచారు. మరోవైపు పలువురు కమల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్‌కాంత్ తదితరులు కూడా కమల్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి రానున్నారు. కాగా అధికార పార్టీ అన్నాడీఎంకేను ఆహ్వానించకపోవడంపై ఆయన స్పందిస్తూ…అన్నాడీఎంకే పార్టీ విధానాలు సరిగా లేకపోవడం వల్లే నేను రాజకీయాల్లోకి వస్తున్నాను. అందుకే వాళ్లలో ఎవర్నీ నేను కలుసుకోవడం లేదు.. అని పేర్కొన్నారు.
మరోవైపు కమల్ రాజకీయ పార్టీని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయనపై అప్పుడే రాజకీయ పరమైన విమర్శలు మొదలైపోయాయి. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మంగళవారం కమల్ ప్రకటించబోయే పార్టీపై పలు వ్యాఖ్యలు చేశారు. “కాగితపు పూలకు గుభాళింపు ఉండదు. అవి ఓ సీజన్‌లో వికసిస్తాయి. త్వరగానే అవి కనుమరుగైపోతాయి..డీఎంకే మర్రిచెట్టు లాంటిదని…దానికి బలమైన వేళ్లు,కొమ్మలు ఉన్నాయని తెలిపారు.