కింగ్ నాగార్జున కీలక పాత్రలో ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న హార్రర్ థ్రిల్లర్ “రాజుగారి గది 2”. “క్షణం, ఘాజీ” లాంటి డీసెంట్ హిట్స్ అనంతరం పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సమంత, సీరత్ కపూర్, వెన్నెలకిషోర్, అశ్విన్ లు నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నా “రాజుగారి గది 2” చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
వినాయక చవితి సందర్భంగా రాజు గారి గది-2 లోగోని ఆవిష్కరించారు. ఈ ఆగస్టు 29న ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు టైటిల్ లోగో ద్వారా ప్రకటించింది చిత్ర యూనిట్.
ప్రవీణ్, షకలక శంకర్, నరేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: దివాకరన్, మ్యూజిక్: తమన్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, డైలాగ్స్: అబ్బూరి రవి, నిర్మాణం: పివిపి సినిమా-మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, దర్శకత్వం: ఓంకార్