అమ్రపాలి క్రేజ్….దేవతని చేశారు

191
Creativity through Ganesh Idols
- Advertisement -

ఆమ్ర‌పాలి.. అత్య‌ధికంగా సోష‌ల్ ఫాలోవ‌ర్స్ ఉన్న‌టువంటి యంగ్ క‌లెక్ట‌ర్. ఆమె  శైలి మొద‌టి నుంచి విభిన్న‌మే.. ఏది చేసినా సంచ‌ల‌న‌మే.. అలాంటి ఆమ్ర‌పాలి ఇటీవ‌లి కాలంలో తీసుకున్న నిర్ణ‌యాలు అటు ప్ర‌జ‌ల‌తోనూ.. ఇటు ప్ర‌భుత్వంతోనూ శ‌భాష్ అనిపించేలా చేస్తున్నాయి. కలెక్టర్ పనితీరుపై ఆట్రాక్ట్ అయిన కొంతమంది ఆమెకు ఫ్యాన్స్‌గా మారిపోయారు. అభిమానానాన్ని కొత్తగా చూపించారు. దీనికి వినాయకచవితి పండుగను వేదికగా చేసుకున్నారు.

Creativity through Ganesh Idols
ఖాజీపేట బాపూజీ నగర్ యువత వినాయకచవితి సందర్భంగా మండపం ఏర్పాటు చేసుకున్నారు. ఆమ్ర‌పాలి త‌ల్లిగా మారి, వినాయ‌కుణ్ని ఒడిలో కూర్చోబెట్టుకున్న‌ట్లుగా ఉన్న విగ్ర‌హాన్ని బాపూజీ నగర్ యువత త‌మ మండ‌పంలో ప్ర‌తిష్టించారు. వీరి సృజ‌నాత్మ‌క‌త‌ను ప్ర‌తిఒక్క‌రూ అభినందిస్తున్నారు. ఆమ్రపాలి విగ్రహం ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయ‌డంతో, రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న‌ నెటిజ‌న్లు కూడా లైక్‌లు, షేర్లు చేస్తున్నారు.

అభిమానం ఆరాధన స్థాయికి చేరుకుంటే నేతలే దైవాలై కొలువుదీరుతారు. రాజకీయ నాయకులు,సినీ హీరోల కటౌట్స్.. రాముడు లేదా మరో దేవుని రూపంలో దర్శనమివ్వడానికి ఇదే కారణం. అయితే ఇది కేవలం వారికే పరిమితం కాలేదు. అందుకు వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలే నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

- Advertisement -