రివ్యూ: విఐపి2

252
Review VIP 2
- Advertisement -

మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై వసూళ్ల వర్షం కురిపించిన చిత్రం ‘రఘువరన్ బీటెక్’. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘వి‌ఐ‌పి2’ను తెరకెక్కించారు. కాజల్, అమాపాల్ నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో ధనుష్ మరోసారి మెప్పించాడా లేదా చూద్దాం…

కథ:

అనిత క‌న్‌స్ట్ర‌క్షన్స్‌లో ప‌నిచేస్తూ ఉత్త‌మ ఇంజినీర్‌గా గుర్తింపు తెచ్చుకొంటాడు ర‌ఘువ‌ర‌న్ (ధ‌నుష్‌). ద‌క్షిణ భార‌త‌దేశంలోనే నెంబ‌ర్‌వ‌న్  క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీకి అధిప‌తి అయిన వ‌సుంధ‌ర  (కాజోల్ )కి ఆ విష‌యం తెలుస్తుంది. అలాంటి ఇంజినీర్ వేరే కంపెనీలో ఉండ‌కూడ‌ద‌ని భావించిన వ‌సుంధ‌ర, త‌న కంపెనీలో చేరిపొమ్మ‌ని పిలుస్తుంది. అందుకు ర‌ఘువ‌ర‌న్ ఒప్పుకోక‌పోవ‌డంతో అత‌ను  ప‌నిచేసే అనిత క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీని  టార్గెట్ చేస్తుంది. చివ‌రికి  అనిత క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ర‌ఘువ‌ర‌న్ బ‌య‌టికొచ్చేలా చేస్తుంది.  ఉద్యోగం పోయిన రఘువరన్ ఏం చేశాడు..? వసుంధరకి ఎలా బుద్దిచెప్పాడు..?అనేది తెర మీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ ధ‌నుష్ యాక్టింగ్, కాజోల్ స్టైలిష్ లుక్‌.  ధ‌నుష్ ర‌ఘువ‌ర‌న్ పాత్ర‌లో మ‌రోసారి ఒదిగిపోయాడు. సెకండ్ హాఫ్‌లో మాస్ అవతారంలో బాగా నటించాడు. ఇక అమలాపాల్.. భర్తను డామినేట్ చేసే భార్య పాత్రలో చక్కటి నటనను కనబరిచింది. హీరో తల్లి స్థానాన్ని ఆక్రమించి, దానికి తగ్గట్లుగానే హావభావాలు పలికించింది. బాధ్యత గల తండ్రి పాత్రలో సముద్రఖని పూర్తి న్యాయం చేశారు.

Review VIP 2
ఇక కాజల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అహంకారం, గర్వం గల వ్యాపారవేత్త పాత్రలో ఒదిగిపోయింది. 40 ఏళ్ల వయసులో కూడా తెరపై చాలా అందంగా కనిపించింది. తన నటనతో సినిమాకు కొత్తదనాన్ని తీసుకొచ్చింది. వివేక్ తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. రీతూవర్మ పర్వాలేదనిపించింది.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ క‌థ‌, క‌థ‌నం , భావోద్వేగాలు, కామెడీ లేకపోవడం. ఈ సినిమా కోసం ధనుష్ రాసుకున్న కథలో వసుంధరా దేవి పాత్ర తప్ప మరే కొత్తదనం కనిపించదు. సెకండ్ హాఫ్‌ను మాత్రం ఆసక్తికరంగా నడిపించలేకపోయింది. కథనంతో విసిగించింది. ఇక క్లైమాక్స్ సన్నివేశాలు మరింత పేలవంగా ఉన్నాయి. హీరో, లేడీ విలన్‌ల మధ్య వచ్చే ఘర్షణ సన్నివేశాలను మరింత బలంగా రాసుకుంటే బాగుండేది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుందంతే. దర్శకురాలిగా సౌందర్య ఈ సీక్వెల్‌ను తెరకెక్కించడంలో యావరేజ్ మార్కులను మాత్రమే దక్కించుకుంది. సియాన్ రోల్డ‌న్ పాట‌లు మామూలుగా అనిపించాయి. నేప‌థ్య సంగీతం బాగుంది. ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

Review VIP 2
తీర్పు:

మొత్తానికి ‘రఘువరన్ బిటెక్’ సినిమాలో కనిపించిన సెంటిమెంట్, ఎమోషన్స్, రొమాన్స్, కామెడీ ఈ సినిమాలో కనిపించలేదనే చెప్పాలి. కేవలం సినిమా ఫస్ట్ హాఫ్, కాజోల్, ధనుష్‌ల పెర్ఫార్మన్స్ మాత్రమే ఈ సినిమాను నిలబెట్టాయి.

విడుదల తేదీ:25/08/2017
రేటింగ్ : 2.25\ 5
న‌టీన‌టులు: ధ‌నుష్‌ ,అమ‌లాపాల్‌, కాజోల్‌
సంగీతం:  సియాన్ రోల్డ‌న్‌, అనిరుధ్‌
నిర్మాత‌లు: ధ‌నుష్‌, ఎస్‌.థాను
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:   సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్‌

- Advertisement -