కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌పై మంత్రి కేటీఆర్ ప్రశంసలు గుప్పించారు. కేంద్రంమంత్రిగా సుష్మాస్వరాజ్ బాధ్యతలు చేపట్టాక విదేశాల్లో ఉంటున్న లక్షలమంది భద్రంగా ఉంటున్నారని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న విదేశీ సంపర్క్ సదస్సులో మాట్లాడిన కేటీఆర్ ఒక్క ట్వీట్‌తో ఆమెకు తమ సమస్యలను చెప్పుకొనే అవకాశం కల్పించారని.. సమస్యలపై ఆమె బాగా స్పందిస్తున్నారని ఆయన తెలిపారు.
విదేశాల్లో బ్లాక్ లిస్టులో ఉన్న యూనివర్సిటీల లిస్ట్ విడుదల చేయాలని దీని ద్వార విద్యార్ధులు మోసపోకుండా ఉంటారని కేటీఆర్ వెల్లడించారు.గల్ఫ్‌లో ఉన్న వారి సమస్యలు పరిష్కరించాలని కేంద్రమంత్రిని కోరారు. ఫేక్ ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరించాలని అక్రమ పాస్ పోర్టు ఏజెన్సీలపై 750 కేసులు నమోదుచేశామని వెల్లడించారు. సౌదీ రెండో కాన్సులేట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుచేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు.
కేంద్ర మంత్రి వీకే సింగ్ మాట్లాడుతూ విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారిని స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. చాలా మంది ఇక్కడ కంటే విదేశాల్లోనే ఉండటానికి మొగ్గు చూపుతున్నారని చెప్పారు.హైదరాబాద్‌కు ఎంతో విశిష్టమైన పేరుందని ఎంతో ఇక్కడి నుంచి ఎంతోమంది విదేశాలకు వెళుతున్నారని తెలిపారు. ఈ సదస్సులో ప్రవాసభారతీయుల పాస్‌పోర్టు సమస్యలతో పాటు ప్రవాస భారతీయుల సంక్షేమం, రక్షణ, అంశాలపై చర్చించనున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ-రాష్ట్ర ప్రభుత్వం మధ్య పలు ఒప్పందాలు జరగనున్నాయి.
I also request MEA to proactively release info about blacklisted Universities in foreign countries to help our students @KTRTRS
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 13, 2017