మహారాష్ట్ర రాజకీయాలు ఈ మద్య తరచూ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆ రాష్ట్రంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ( ఎన్సీపీ ) రెండుగా చీలిన సంగతి తెలిసిందే. గతంలో ఆ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న అజిత్ పవార్ అనూహ్యంగా షిండే వర్గంలో చేరారు. అంతే కాకుండా మరో 30 మంది ఎమ్మెల్యేలను కూడా ఎన్సీపీ నుంచి తనతో పాటు బయటకు తీసుకొచ్చారు. దీంతో శరత్ పవార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఎన్సీపీ తీవ్రంగా బలహీన పడింది. ఇదిలా ఉంచితే షిండే వర్గంలో చేరిన అజిత్ పవార్ ఆ వెంటనే డిప్యూటీ సిఎం పదవి చేపట్టి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు ఆయన ఏకంగా సిఎం పదవిపైనే గురి పెట్టారని టాక్. ఇదే విషయాన్ని ఎన్సీపీలోని అమోల్ మిత్కారి ట్విట్టర్ ద్వార స్పష్టం చేశారు. దీంతో సిఎం పదవే టార్గెట్ గా అజిత్ పవార్ షిండే వర్గంతో చేతులు కలిపారా అనే డౌట్ రాక మానదు.
Also Read:హైకోర్టు సీజేగా అలోక్ అరాధే ప్రమాణస్వీకారం
గతంలో శరత్ పవార్ నేతృత్వంలో ఉన్నప్పుడూ కూడా అజిత్ పవార్ పార్టీ ఆధిపత్యం కోసం గట్టిగా ప్రయత్నించారు. కానీ శరత్ పవార్ ఆ ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఏకంగా ఎన్సీపీలోనే చీలిక తెచ్చి శరత్ పవార్ కు ఊహించని షాక్ ఇచ్చారు. ఇప్పుడు షిండే వర్గంతో చేతులు కలిపి.. ఏకంగా సిఎం కావాలని అజిత్ భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా బిజెపి అండతో సిఎం పదవి చేపట్టిన షిండేను ఆ పదవి నుంచి తొలగించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయా అంటే అవునేమో అనే డౌట్ వస్తోంది. అజిత్ పవార్ షిండే వర్గంలో చేరడం వెనుక కూడా బీజేపీ హస్తం ఉందనేది విశ్లేషకులు చెప్పే మాట. ఇప్పుడు షిండే స్థానంలో అజిత్ పవార్ సిఎం కావాలని ఆశించడంలో బీజేపీ హస్తం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి రాబోయే రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొనున్నాయో చూడాలి.
Also Read:ఇంటి పరిసరాల శుభ్రతతో వ్యాధులు పరార్..