నేటి రోజుల్లో ప్రతిఒక్కరి ఇంట్లో ఫ్రీడ్జ్ తప్పనిసరిగా ఉంటుంది. దాంతో ఫ్రీడ్జ్ నీరు త్రాగడం ఒక అలవాటుగా మారుతుంది. ఎక్కడికైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, లేదా నీరు దాహం వేసినప్పుడు కచ్చితంగా ఫ్రీడ్జ్ లోని కూలింగ్ వాటర్ తాగడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు చాలా మంది. ఇంకా చెప్పాలంటే భోజనం చేసే టప్పుడు కూడా చల్లని నీరు త్రాగనిదే కొందరికి ముద్ద కూడా దిగదు. మరి అన్నీ సమయాల్లో చల్లటి నీరు త్రాగడం మంచిదేనా ? మరి ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు కూలింగ్ వాటర్ తాగితే ఎమౌతుంది ? అనే విషయాల గురించి తెలుసుకుందాం.. !
సాధారణంగా చల్లటి నీరు త్రాగడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అయితే ఎండాకాలంలో చల్లని నీరు త్రాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. అలా కాకుండా వర్షాకాలంలో కూడా చల్లని నీరు త్రాగితే అనారోగ్య ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు చల్లటి నీరు త్రాగడం అసలు మంచిది కాదట. భోజనం చేసిన తరువాత చల్లని నీరు త్రాగితే జీర్ణాశయంలోని రసాయనాలు కృశించుకునిపోయే అవకాశం ఉంది తద్వారా జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది.
Also Read: పనసపండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!
ఇంకా మనం తీసుకునే ఆహార పదార్థాలలోని కొవ్వు సమ్మేళనలు జీర్ణాశయంలో గడ్డకట్టుకుపోయే ప్రమాదం ఉంది. తద్వారా కొవ్వు శాతం పెరుగుతుంది. ఇంకా చల్లటి నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని రంద్రాలు మూసుకుపోతాయి. తద్వారా బాడీలోని వ్యర్థాలు బయటకు పోవడానికి వీలు ఉండదు. ఇంకా కూలింగ్ వాటర్ తాగడం వల్ల రక్త ప్రసరణ కూడా మందగిస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో చల్లటి నీరు త్రాగడం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు భోజనం చేసే టైమ్ లోనూ కూలింగ్ వాటర్ కు బదులుగా గోరువెచ్చని నీరు త్రాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Also Read: బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే.. ఇవి పాటించండి!