మద్యం తాగాక కాఫీ తాగితే ఏమవుతుంది?

9
- Advertisement -

చాలామందికి మద్యపానం ఒక వ్యసనంలా మారుతుంది. దీనిని మానుకునేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఈ అలవాటు నుంచి బయటపడలేక పోతుంటారు. కొంతమంది మద్యం తగినప్పటికి మత్తును అదుపులో ఉంచుకునేందుకు మార్గం వెతుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే మద్యం తాగిన తర్వాత వెంటనే కాఫీ తాగితే మద్యం యొక్క మత్తు తగ్గుతుందనే భావన చాలమందిలో ఉంది. నిజానికి ఇదొక అపోహ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాఫీలో కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి ఉత్సాహాన్ని ప్రేరేపిస్తుంది. అందువల్ల మద్యం సేవించినప్పుడు కాఫీ తాగితే మత్తు దిగిపోతుందని చాలమంది అభిప్రాయం. అయితే మద్యానికి కాఫీ ఏ మాత్రం విరుగుడు కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ లోని కారకాలు మద్యం యొక్క మత్తును ఏ మాత్రం తగ్గించలేవు.

ఇక మద్యం మాదిరిగానే చాలమందికి కాఫీ తాగడం కూడా ఒక వ్యసనంలా ఉంటుంది. తలనొప్పిగా అనిపించినప్పుడు లేదా అలసట చెందినప్పుడు కాఫీ తాగి కొంత రిలాక్స్ అవుతుంటారు. అయితే పరిమితి మేర కాఫీ తాగడం మంచిదే. ఈ అలవాటు శృతిమించితే నిద్రలేమి, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక మద్యం అలవాటు ఉన్నవారిలో కాలేయం వేగంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మద్యం సేవించే అలవాటును వీలైనంత వరకు మర్చిపోవలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మద్యాన్ని మానుకునేందుకు కాఫీ తాగడం అనేది ఒట్టి అపోహ మాత్రమే. కాబట్టి మద్యాన్ని మానుకునేందుకు మానసిక నిపుణులను సంప్రదించి వారి సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ అలవాటు నుంచి బయట పడవచ్చు.

Also Read:వేసవిలో చెరుకురసం తాగుతున్నారా?

- Advertisement -