బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే..!

48
- Advertisement -

నేటిరోజుల్లో బెల్లి ఫ్యాట్ అనేది చాలమందిని వేదిస్తున్న సమస్య.. ఎందుకంటే ఎక్కువ శాతం మంది కూర్చొని పని చేయడంవల్ల పొట్ట చుట్టూ విపరీతంగా కొవ్వు పెరుకుపోయి బెల్లి ఫ్యాట్ ఏర్పడుతూ ఉంటుంది. బెల్లి ఫ్యాట్ పెరగడం వల్ల మన డైలీ యాక్టివిటీస్ కూడా చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలమంది ఈ బెల్లి ఫ్యాట్ ను ఎదుర్కొంటున్నారు. బెల్లి ఫ్యాట్ ఉన్నవాళ్లలో నలుగురిలో కాన్ఫిడెంట్ గా ఉండలేరు. ఏ డ్రెస్ వేసుకున్న సరిగా సెట్ అవదు. కొద్ది దూరం నడవడానికే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా బెల్లి ఫ్యాట్ కారణంగా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ బెల్లి ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు కూడా త్వరగా అటాక్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల బెల్లి ఫ్యాట్ ను తగ్గించుకోవడం చాలా అవసరం. కాగా వేగంగా బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే కొన్ని నియమాలు తప్పనియారిగా పాటించాల్సిందే అవేంటో తెలుసుకుందాం.. !

చక్కెర స్థాయి తగ్గించడం
చాలమంది తీపి పదార్థాలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బెల్లి ఫ్యాట్ పెరగడానికి తీపి అధికంగా తినడం కూడా ఒక కారణం. ఎందుకంటే తీపి పదార్థాలు జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇందులో ఉండే గ్లూకోజ్ మరియు లాక్టోజ్ శరీరంలో కొవ్వు శాతాన్ని పెంచి బెల్లి ఫ్యాట్ కు కారణం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి.

కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోవడం
శరీరంలో కొవ్వు శాతాన్ని పెంచడంలో కార్బోహైడ్రేట్స్ పాత్ర కూడా ఉంటుంది. మనం తినే అన్నం, గోదుమలతో చేసిన ఆహారం, బంగాళాదుంప,చిలకడదుంప.. మొదలగు వాటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచి, పొట్ట చుట్టూ మరియు తొడల భాగంలోనూ కొవ్వు పెరుకుపోయేలా చేస్తుంది. కాబట్టి బెల్లి ఫ్యాట్ తగ్గించాలి అనుకునే వాళ్ళు కార్బోహైడ్రేట్స్ పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది.

సరైన వ్యాయామం
బెల్లి ఫ్యాట్ తగ్గాలంటే సరైన ఆహార నియమాలతో పాటు సరైన వ్యాయామం కూడా చాలా అవసరం. ఆఫ్ కోడ్స్, పుష్ అప్స్, ఫ్రాగ్ జంప్ వంటి వ్యాయామ సాధనాలు ప్రతిరోజూ చేయడం వల్ల బెల్లి ఫ్యాట్ వేగంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది.

Also Read:లాల్ సలామ్..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -