అయఆహారం తిన్న తరువాత చాలమందికి ఛాతీలో మంట ఏర్పడి విపరీతంగా బాధపడుతూ ఉంటారు. ఇలా ఛాతీలో మంట రావడానికి ప్రధాన కారణం. సమయానికి భోజనం చేయకపోవడమే. వంటల్లో మసాలాను ఎక్కువగా ఉపయోగించడం. కూరల్లో కారం శాతం ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఛాతీలో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇదిలాగే కొనసాగితే తీవ్రమైన అసిడిటీకి దారి తీస్తుంది. ఇంకా గ్యాస్టిక్ అల్సర్, పేగుల్లో ఇన్ఫ్లమేషన్ కు కూడా దారి తీస్తుంది. కాబట్టి ఛాతీలో మంట లేదా నొప్పి వంటి లక్షణాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదు. అయితే ఈ సమస్యను దూరం చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి అవేంటో చూద్దాం !
గ్యాస్ సమస్యలు లేదా ఛాతీలో మంట, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించాలంటే.. అన్నిటికంటే ముఖ్యమైనది సమయానికి భోజనం చేయడం, టైమ్ కి భోజనం చేస్తే ఈ సమస్యలేవీ దారి చేరవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఉపవాసం చేసే వారిలో కూడా ఈ రకమైన సమస్యలు కనిపిస్తుంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఉపవాలు చేయకపోవడమే మంచిది. అలాగే మనం తినే ఆహారం లో కారం, మసాలాలు ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఇంకా ఆహారం తిన్న తరువాత పులుపు పదార్థాలు అనగా నిమ్మకాయ, నారింజ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.
ఛాతీలో మంటకు అల్లం చాలా చక్కగా పని చేస్తుంది. అల్లంలో ఉండే ఇన్ఫ్లమెంటరీ గుణాలు జీర్ణశయాన్ని చల్లబరిచే లక్షణాలను కల్గి ఉంటుంది. అందువల్ల ఎసిడిటీ, గ్యాస్టిక్ సమస్యలను అల్లం తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం అల్లం టీ తాగితే ఈ రకమైన సమస్యలకు చెక్ పడుతుందట.
యాపిల్స్ కూడా ఛాతీలో మంటను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇతిలో ఉండే పెక్టిన్ అనే పీచు పదార్థం జీర్ణ శక్తిని పెంచి పరోక్షంగా ఎసిటీటీ, గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది.
కలబంద కూడా జీర్ణశయ సమస్యలను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఇది జీర్ణశయ స్రావాలను క్రమబద్దీకరించి ఎసిడిటీని దూరం చేస్తుంది. కలబంద రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఈ సమస్యలు దూరం అవుతాయట.
Also Read: ఓటీటీలోకి ఆ ముడు సినిమాలు