పెద్ద ప్రేగు క్యాన్సర్ లక్షణాలివే..జాగ్రత్త!

45
- Advertisement -

నేటి రోజుల్లో ఉదర సంబంధిత వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మారుతున్న జీవన శైలి లేదా ఆహారపు అలవాట్ల కారణంగా ఎన్నో కడుపు సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మలబద్దకం, తరచూ ఎసిడిటీ బారిన పడడం, ఆకలి మందగించడం.. ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతునాయి. అయితే ఇవి సాధారణ సమస్యలే అని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలాంటి చిన్న చిన్న లక్షణలే క్యాన్సర్ వంటి పెద్ద వ్యాధులకు సంకేతాలని గుర్తించుకోవాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మద్య పెద్ద ప్రేగు క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు పెరుగుతోంది..

అయితే ఈ ప్రేగువ్యాధి ని గుర్తించలేకా చాలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ప్రేగు క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యం తీసుకుంటే మేలని వైద్యులు చెబుతున్నా మాట. మలంలో ఎక్కువగా రక్తం పడుతుండడం అది కూడా ముదురు రంగులో ఉండడం, పొట్ట కింది భాగంలో నొప్పిగా ఉండడం, కడుపు ఉబ్బరంగా నిండుగా అనిపించడం, వంటి లక్షణాలు ప్రేగు క్యాన్సర్ కు సంకేతం కావొచ్చు. అయితే ఇలాంటి సమస్యలు కొన్ని కొన్ని సార్లు సాధారణంగా అనిపించినప్పటికి ఎక్కువసార్లు ఈ లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం నిర్లక్షం చేయకూడదు.

ఇంకా బరువు కోల్పోతూ ఉండడం. నీరసం, నిసత్తువ ఆవహించడం, మలవిసర్జన చేసేటప్పుడు నొప్పిగా అనిపించడం, విసర్జన కూడా సాఫీగా జరగకపోవడం.. ఇవన్నీ ప్రేగు క్యాన్సర్ యొక్క లక్షణాలే. ముఖ్యంగా 50 ఏళ్ళు పైబడిన వారే ఈ ప్రేగు క్యాన్సర్ కు గురౌతూ ఉంటారు. కానీ నేటిరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా దీనిబారిన పడుతున్నారు. ఇంకా మన జీవన శైలిలో కొన్ని అలవాట్ల కారణంగా కూడా ఈ ప్రేగుక్యాన్సర్ సంభవిస్తుంది. అతిగా సిగరెట్లు తాగడం, మద్యపానం, వంటివి కూడా ప్రేగు క్యాన్సర్ కు దారి తీస్తాయి. కాబట్టి ఇలాంటి అలవాటు మానుకోవడం చాలా మంచిది. ఇక పై లక్షణాలు ఉన్నవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:ఓటీటీలోకి ఆ ముడు సినిమాలు

- Advertisement -