భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గొప్ప మనసు చాటుకున్నారు. ఒడిశా రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కొల్పోయిన చిన్నారులకు అండగా నిలిచారు. గురుగ్రామ్‌లోని సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆ చిన్నారులకు ఉచిత విద్య అందించనున్నట్లు వెల్లడించారు.
ప్రమాదంలో చనిపోయిన వారి పిల్లల చదువు బాధ్యతను తీసుకోవడం…. ఆ పిల్లలను నా స్కూల్లో ఉచితంగా విద్యను అందిస్తాను అని వెల్లడించారు. రైలు ప్రమాదంలో సహాయక చర్యల్లో పాల్గొని క్షతగాత్రులను వెలికి తీసిన వారికి, వైద్య బృందాలకు, స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారికి సెల్యూట్ చేశాడు.
Also Read:పర్యావరణ దినోత్సవం..గ్రీన్ ఇండియా ఛాలెంజ్
సెహ్వాగ్ నిర్ణయంపై అంతా ప్రశంసలు గుప్పించారు. అదానీ గ్రూప్ సైతం రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఉచితంగా చదివించనున్నట్లు ప్రకటించింది.
షాలిమార్-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్, ఒక గూడ్స్ రైలు శుక్రవారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 275 మంది చనిపోగా.. వెయ్యి మంది దాకా గాయపడ్డారు. దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం ఇది.
Also Read:జలుబు నివారణకు చిట్కాలు..