సెలక్షన్ ఫ్యానల్‌లో సెహ్వాగ్..!

94
sehwag

భారత మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్సు 2020 సెలక్షన్ కమిటీలో చోటు దక్కింది. సెహ్వాగ్‌తో పాటు సర్దార్, దీపా మాలిక్ తదితరులకి చోటు దక్కింది.

ఈ ప్యానల్‌కు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ముకుందకం శర్మ ఛైర్మన్‌గా ఉండనుండగా రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న, ద్రోణాచార్య అవార్డ్స్, అర్జున అవార్డ్స్,ధ్యాన్‌చంద్ అవార్డ్స్ తదితర పురస్కారాల కోసం అథ్లెట్స్, కోచ్‌లను ఎంపిక చేయనుంది.

ప్రతీ ఏటా హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డులని అథ్లెట్స్‌,కోచ్‌లకి అందజేస్తారు. కానీ ఈసారి కరోనా కారణంగా అవార్డుల ప్రధానోత్సవం కాసింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.