అమెరికాకు ప్రధాని మోడీ..

72
- Advertisement -
ప్రధామంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు జూన్‌ 22న ప్రధాని అమెరికా వెళ్లనున్నారు. మోదీ కోసం జో బైడెన్, జిల్ బైడెన్‌ స్టేట్‌ డిన్నర్‌ను ఏర్పాటు చేయనున్నారు.   భారత ప్రధాని పర్యటన రెండు దేశాల మధ్య బలమైన, సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
కీలక అంశాలపై మోడీ -బైడెన్ చర్చించే అవకాశం ఉంది. పలు రంగాల బలోపేతంపై రెండు దేశాలు ఇప్పటికే పరస్పరం సహకరించుకుంటున్నాయి. సాంకేతికత, వాణిజ్యం, పరిశ్రమలు, పరిశోధన, విద్య, క్లీన్ ఎనర్జీ, రక్షణ, భద్రత వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సహకారంపై ఇద్దరు నాయకులు సమీక్షించే అవకాశాలు ఉన్నాయి.
బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత 2021లో ప్రధాని మోదీ వైట్ హౌస్‌లో ఆయన్ను కలిశారు. ఇక  జీ20 కూటమికి ఈ ఏడాది భారత్ నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో మోడీ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
- Advertisement -