భారత సైన్యం ప్రతి సంవత్సరం మే1న ఆర్మ్డ్ కార్ప్స్ రైజింగ్ డేగా జరుపుకుంటుంది. 1938 మే 1న భారత సైన్యంలోకి గుర్రాల స్థానంలో యుద్ధ ట్యాంకులను తీసుకువచ్చి మొదటి రెజిమెంట్‌గా స్కిండే హార్స్ రెజిమెంట్ నిలిచింది. ఈ సందర్భంగా ఆర్మీ జనరల్ మనోజ్ పాండే ఈ మేరకు ట్వీట్ చేశారు. మన భారత సైన్యం పరాక్రామాన్ని తెలిపే వీడియోను ఆర్మీ అధికారులు విడుదల చేశారు. ప్రతి ఆఫీసర్, ర్యాంకర్ ,ప్రతి సైనికుడికి శుభాకాంక్షలు తెలిపారు.
1971లో భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో ఆర్మ్‌డ్ రెజిమెంట్ సాహాసోపేతమైన ప్రదర్శనను కనబరిచింది. అంతేకాదు ఈ యుద్ధంలో భారత్ విజయంలో కీలకభూమిక పోషించింది. ఈ రెజిమెంట్‌ను బ్రిటిష్ వలస పాలనలో 1776లో ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతి పెద్ద సైనిక వ్యవస్థ, అయుధ సంపత్తి కలిగిన రెజిమెంట్‌గా నిలిచింది.
Also Read: CMKCR: పారిశుధ్య కార్మికులకు మేడే కానుక
ప్రస్తుతం ఇందులో 67 ఆర్మ్‌డ్ రెజిమెంట్స్ కలిగి ఉంది. ఆహ్మద్‌నగర్‌లో ఆర్మ్డ్ కార్ప్స్ ట్రైనింగ్ స్కూల్ ఉంది. ఈ ఆర్మ్డ్ కార్ప్స్ మోటో శౌర్య తేజో యుద్దో దీనిని భగవద్గీత నుంచి తీసుకోబడింది. ప్రస్తుతం ఈ రెజిమెంట్‌లో డీఆర్డీవో తయారుచేసిన టీ90 బీష్మ, టీ-72, ఎం1 ఆజేయ ఎంకే1 ఎంకే2 వేరియంట్స్‌తో కూడిన యుద్ధ ట్యాంకులు ఉన్నాయి.
Also Read: కన్నడ రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్ర..
General Manoj Pande #COAS and All Ranks of #IndianArmy convey best wishes to All Ranks, Veterans & Families of Armoured Corps on the occasion of 85th #ArmourDay. #IndianArmy #OnPathToTransformation pic.twitter.com/igsccgSW60
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 1, 2023