CM KCR:వందకుపైగా సీట్లు సాధిస్తాం

50
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొడతామన్నారు సీఎం కేసీఆర్. వందకు పైగా స్ధానాల్లో బీఆర్ఎస్ పార్టీదే గెలుపన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరుగుతున్న బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో పాల్గొని మాట్లాడారు సీఎం. రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండడం వల్లే పెట్టుబడులు వస్తున్నాయన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ… తెలివి ఉంటే బండమీద కూడా నూకలు పుట్టించుకోవచ్చు అన్నారు.

రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతో తెలంగాణ సాధించుకున్నాం. పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలిపాం అన్నారు. . అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ముందుకు సాగుతున్నాం. కరెంటు, రోడ్డు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్యసంపద, ఇలా ప్రతీరంగంలో దేశమే ఆశ్చర్యపోయేలా ప్రగతిని తెలంగాణ నమోదు చేసింది. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.

Also Read:నో డౌట్.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు !

వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి విజన్‌ లేదు…మనం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర అంటున్నది. కానీ, తెలంగాణ ఎందుకు దివాలా తీస్తలేదని ప్రశ్నించారు. 2021-2022 ముందు జీఎస్టీ ఆదాయం రూ.34వేల కోట్లు ఉంటే అంచనాలు 44వేల కోట్లు పెట్టుకున్నాం అన్నారు. నియోజకవర్గాల వారీగా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలి. పల్లెనిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలని సూచించారు.

Also Read:BRS:ప్రతినిధుల సభ…తీర్మానం ప్రవేశపెట్టిన కేటీఆర్

- Advertisement -