నో డౌట్.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు !

51
- Advertisement -

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని గత కొన్నాళ్లుగా ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజలు తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా సి‌ఎం ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, ప్రజలంతా సిద్దంగా ఉండాలని ఇలా రకరకలుగా చెప్తూ వస్తున్నారు. అయితే ముందస్తు ఎన్నికలు ఉండబోవని కే‌సి‌ఆర్ సర్కార్ చాలాసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికి ప్రతిపక్షాలు మాత్రం ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేయడం ఆపడం లేదు. దాంతో తాజాగా మరోసారి ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు సి‌ఎం కే‌సి‌ఆర్.. ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళే చాన్సే లేదని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.

దీంతో ప్రతిపక్షాల అసత్య వ్యాఖ్యలకు కళ్ళెం పడినట్లైంది. ఇక 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కే‌సి‌ఆర్ నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు. 2018లో ముందస్తు ఎన్నికలు జరిగినప్పటికి ఆ ఎన్నికల్లో కూడా కే‌సి‌ఆర్ పాలననే కోరుకున్నారు ప్రజలు. ఈసారి కూడా సేమ్ అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. తెలంగాణలో అమలౌతున్న పథకాలు, రైతు సంక్షేమం కోసం సి‌ఎం కే‌సి‌ఆర్ ప్రవేశ పెడుతున్న విధానాలకు ప్రజలు భారీగా మద్దతు పలుకుతున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని నిరాధార ఆరోపణలు చేస్తున్నప్పటికి.. ప్రజలు కే‌సి‌ఆర్ సుపరిపాలననే కోరుకుంటున్నారు.

Also Read: BRS:ప్రతినిధుల సభ…తీర్మానం ప్రవేశపెట్టిన కేటీఆర్

దాంతో వచ్చే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడం ఖాయమనే చెప్పాలి. ఇక షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సి‌ఎం కే‌సి‌ఆర్ చెప్పడంతో ఎన్నికలకు ఆరు నుంచి ఏడు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఇప్పటి నుంచే ఎన్నికల ప్రణాళికలకు తెరతీస్తున్నాయి రాజకీయ పార్టీలు. మరీ విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసిన వచ్చే ఎన్నికల్లో కూడా బి‌ఆర్‌ఎస్ గెలుపును ఆపడం కష్టమే అనేది పోలిటికల్ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట.

Also Read: ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్బావం..

- Advertisement -