Stalin:గవర్నర్లే టార్గెట్‌గా సీఎంలకు లేఖ

34
stalin
- Advertisement -

మరోసారి గవర్నర్ల వ్యవస్థను ప్రశ్నిస్తూ బీజేపీయేతర సీఎంలకు లేఖ రాశారు తమిళనాడు సీఎం స్టాలిన్. అసెంబ్లీ అమోదించిన బిల్లులను అమోదించడానికి గవర్నర్‌లకు కాలపరిమితి నిర్ణయించాలని కేంద్రప్రభుత్వం, రాష్ట్రపతిని కోరుతూ తీర్మానాన్ని అమోదించాలని సీఎంలను లేఖలో కోరారు.

భారత రాజ్యాంగం గవర్నర్ పాత్రతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రలు, బాధ్యతలను స్పష్టంగా సూచించిందని అన్నారు. అయితే, ప్రస్తుతం రాజ్యాంగ సూత్రాలు గౌరవించబడడం, అనుసరించడం లేదన్నది స్పష్టంగా కనిపిస్తుందని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.

తమిళనాడు అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని బీజేపీయేతర ముఖ్యమంత్రులకు పంపిన స్టాలిన్..తమిళనాడు తీర్మానంతో ఏకీభవిస్తారని అనుకుంటున్నానని చెప్పారు. దీనిని ఆమోదించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు, శాసనసభల సార్వభౌమాధికారం, ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మద్దతును అందిస్తారన్నారు. బిల్లుల ఆమోదం విషయంలో అనేక రాష్ట్రాలకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని అంతా కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -