వేసవిలో అద్భుతమైన ఫుడ్, డ్రింక్స్ ఇవే

29
- Advertisement -

ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. భాగ్యం పోయినా వస్తోందేమో గానీ, ఆరోగ్యం పోతే మాత్రం తిరిగి రాదు. అందుకే, ఆరోగ్యం విషయంలో అవగాహన ఉండాలి. ముఖ్యంగా వేసవికాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. దీంతో డిహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైగా ఎన్ని నీళ్లు తాగిన దాహం తీరదు. మరి భగభగ మండే ఎండల్లో ఎలాంటి ఫుడ్ తినాలి?, ఎలాంటి డ్రింక్స్ తాగాలి ?, తెలుసుకుందాం రండి. గుర్తు పెట్టుకోండి. వేసవిలో ఈ డ్రింక్స్ తీసుకోవడం వలన వెంటనే ఉపశమనం లభిస్తుంది. చెరుకు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, దానిమ్మరసం తీసుకోవడం వల్ల శరీరం చాలా చల్లగా మారుతుంది. అలాగే రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ఈ జ్యూస్ లు అద్భుతంగా పని చేస్తాయి.

అలాగే వేసవిలో మరో గొప్ప ఫుడ్ గురించి చెప్పాలి. ఇది తింటే.. ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. అదే సొరకాయ. మీరు విన్నది నిజమే. వేసవిలో సొరకాయ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో వేడి తగ్గించడంతో పాటు సొరకాయ మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు అయితే సొరకాయ దివ్యౌషధమే. జీర్ణ వ్యవస్థను చాలా బాగా మెరుగుపరుస్తుంది సొరకాయ. సొరకాయతో పేగులు శుభ్రం కావడం సహా హీమోగ్లోబిన్ పెరుగుతుంది. అందుకే, వేసవిలో సొరకాయ దివ్యౌషధంలా పని చేస్తోంది.

వేసవిలో తర్బూజ, కర్బూజ, పీచ్‌, బెర్రీ, అంగూర్‌ వంటి పండ్లను తినాలి. అలాగే ప్రొటీన్స్, ఫైబర్ అధికంగా గల మొలకెత్తిన గింజలను కూడా తీసుకుంటే మంచిది. అన్నిటికి మించి వేసవిలో చద్దన్నం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చద్దన్నం ఉదయం తినడం వల్ల ఆ రోజంతా చలాకీగా ఉంటారు. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం బాగా తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి ని పెంచుతుంది. అల్సర్ ను నివారిస్తుంది. ఇందులో ఉల్లిపాయ, పెరుగు వేసుకొని తింటే శరీరంలోని వేడిని చాలా బాగా తగ్గుతుంది. కాబట్టి.. వేసవిలో తాగే, తినే పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Also Read:Harishrao:విశ్వసనీయతే ముఖ్యం..పదవులు కాదు

- Advertisement -