ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ముంబై అదరగొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో గుజరాత్‌ని చిత్తుచేసింది. గుజరాత్‌కు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించగా 15.1 ఓవర్లకే 64 పరుగులకు గుజరాత్ జెయింట్స్ ఆలౌట్ అయింది. ఓపెనర్లు సబ్బినేని మేఘన (2), బెత్ మూనీ (0) పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. కేవలం 12 పరుగులకే గుజరాత్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనుకుంటున్న సమయంలో హేమలత (29) పోరాడి పరుగులు రాబట్టింది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కేవలం 30 బంతుల్లో 65 రన్స్ తో రాణించగా ఓపెనర్ హేలీ మాథ్యూ 31 బంతుల్లో 47 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా హర్మన్ ఎంపికైంది.
ఇవాళ డబ్ల్యూపీఎల్ టోర్నీలో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో బెంగళూరు, ఢిల్లీ, రెండో మ్యాచ్‌లో యూపీ, గుజరాత్ జట్లు తలపడనున్నాయి.
ఇవి కూడా చదవండి..