IPL 2023:గుజరాత్ vs ముంబై.. ఫైనల్ కు వెళ్ళేదేవరు!

39
- Advertisement -

ఐపీఎల్ లో నేడు క్వాలిఫయర్ 2 లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7:30 నిముషాలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ గుజరాత్ అహ్మదాబాద్ స్టేడియంలో జరగనుంది. క్వాలిఫయర్ 1 లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన గుజరాత్ ఈ మ్యాచ్ గెలిచి ఎలాగైనా ఫైనల్ కు చేరాలని పట్టుదలగా ఉంది. సొంత గడ్డపై జరుగుతుండడం గుజరాత్ కు కలిసొచ్చే అంశం. అటు ముంబై ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను చిత్తు చేసి క్వాలిఫయర్ 2 లోకి అడుగుపెట్టింది. ఇక మ్యాచ్ లో కూడా గెలిచి ఫైనల్ కు చేరాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతుంది. .

ఇక ఈ రెండు జట్ల మద్య హెడ్ టూ హెడ్ రికార్డ్ లను పరిశీలిస్తే మూడు మ్యాచ్ లు జరుగగా అందులో ముంబై రెండు విజయాలు, గుజరాత్ ఒక విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఇరు జట్లు కూడా అత్యంత పటిష్టంగా ఉన్నాయి. బ్యాటింగ్ ప్రధాన బలంగా ముంబై బరిలోకి దిగుతుంటే, అల్ రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ కూడా బలంగా కనిపిస్తుంది. దాంతో ఇరు జట్లకు కూడా టాస్ కీలకం కానుంది టాస్ నెగ్గిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్ ఆరోసారి కూడా కుప్పు వేటలో అడుగు దూరంలో ఉంది. అటు గుజరాత్ గత సీజన్ లో కప్పు గెలిచి ఈ సీజన్ లో కూడా అడుగు దూరంలో నిలిచింది. ఈ రెండు జట్లలో ఏ జట్టు ఫైనల్ కు వెళ్ళిన.. ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో రసవత్తరమైన పోరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి నేడు జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధించి ఫైనల్ కు వెళుతుందో చూడాలి.

Also Read:కేజ్రివాల్ పై మోడీ కక్ష గట్టారా?

- Advertisement -