డేట్ లాక్ చేసుకున్న గోపీచంద్

22
- Advertisement -

మేచో స్టార్ గోపీచంద్ నెక్స్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తనకి లౌక్యం తో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీ వాస్ తో ‘రామబాణం’ సినిమా చేస్తున్న గోపీచంద్ ఈ సినిమాతో సమ్మర్ లో థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. మే 5 న సినిమా రిలీజ్ అంటూ ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు.

కలకత్తా , హైదరాబాద్ లో జరిగే కథతో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మీదే గోపీచంద్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. గత కొన్నేళ్ళుగా గోపీచంద్ కి సరైన సక్సెస్ లేదు. మొన్నీ మద్య మారుతి డైరెక్షన్ లో చేసిన పక్కా కమర్షియల్ కూడా వర్కవుట్ అవ్వలేదు. దీంతో శ్రీవాస్ తనకి మళ్ళీ ఓ సక్సెస్ ఇచ్చి హిట్ ట్రాక్ లోకి తీసుకొస్తాడని నమ్ముతున్నాడు.

మే నెలలో గోపీచంద్ సినిమాతో పాటు పాన్ ఇండియా మూవీ ‘హనుమాన్’ , అల్లరి నరేష్ ‘ఉగ్రం’ , నాగ చైతన్య ‘కస్టడీ’ ప్రేక్షకుల రాబోతున్నాయి. మరి ఈ సినిమాలతో పోటీ పడి సమ్మర్ లో మేచో స్టార్ ఎలాంటి విజయం ఉంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి…

మహావీరుడు..గాన గాన పాట

ఎన్టీఆర్ హీరోయిన్ కి కూడా ఇవ్వాలట!

అందుకే జాగ్రత్తగా ఉంటుందట!

- Advertisement -