‘సార్’ కోసం విద్యార్థుల ధర్నా!

25
- Advertisement -

దనుష్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో శివరాత్రి కానుకగా వచ్చిన సార్ సూపర్ హిట్ అనిపించుకుంది. ముందు వేసిన ప్రీమియర్ షోస్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ప్రస్తుతం థియేటర్స్ సందడి చేస్తున్న ఈ సినిమాను ఫ్రీగా చూపించాలని ఖమ్మంలో స్కూల్ విద్యార్థులు తమ ఉపాద్యాయులతో కలిసి ధర్నాకి దిగారు.

విద్యార్థులు తమకి ఫ్రీ షో ద్వారా సార్ చూపించాలని రోడ్డెక్కడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయింది. వెంటనే నిర్మాత నాగ వంశీ రియాక్ట్ అవుతూ ట్వీట్ చేశారు. విద్యార్థుల కోసం తప్పకుండా ఫ్రీ షోస్ ఎరేంజ్ చేస్తామని తెలిపాడు. ఫ్రీషో చూడాలనుకునే స్కూల్ కిడ్స్ తమని సంప్రదిస్తే కచ్చితంగా వారికోస సినిమాను ప్రదర్శిస్తామని హామీ ఇచ్చి contact@sitharaents.com మెయిల్ చేయమని తెలిపాడు. తమను మెయిల్ ద్వారా అప్రోచ్ అయితే టీం షోస్ ఎరేంజ్ చేస్తుందని తెలిపాడు.

సో ఖమ్మంలో విద్యార్థుల ధర్నా వల్ల మిగతా ప్రాంతాల విద్యార్థుల కూడా ఫ్రీ సినిమా చూసే అవకాశం దొరికినట్టయింది. ఏదేమైనా దనుష్ ‘సార్’ కమర్షియల్ గా సక్సెస్ అనిపించుకోవడంతో పాటు ప్రశంసలు కూడా అందుకుంటూ ముందుకెళ్తుంది.

ఇవి కూడా చదవండి…

ఏప్రిల్‌14…రుద్రుడు విడుదల

ఆమె ఆశలన్నీ మహేష్ పైనే !

NTR30 హీరోయిన్ ఎనౌన్స్ మెంట్ వస్తుంది.

- Advertisement -