- Advertisement -
తజకిస్థాన్ను భారీ భూకంపం వణికించింది. ఇవాళ ఉదయం 5.37 గంటలకు భారీ భూకంపం సంభవించగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.8గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
గోర్నో-బదక్షన్ ప్రాంతంలో భూమికి 20.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్జీఎస్ పేర్కొంది. ఆ తర్వాత 20 నిమిషాలకు 5.0 తీవ్రతతో అదే ప్రాంతంలో మరో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపిచడంతో ఇండ్లలో నుంచి బయటకు పరుగుతు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.
ఇప్పటికే భూకంపం ధాటికి టర్కీ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వరుస భూకంపాలు వస్తుండటంతో దాదాపు 50 వేలకి పైగా ప్రజలు మృత్యువాత పడగా పెద్ద సంఖ్యలో ఆస్తి నష్టం సంభవించింది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -