గ్రీన్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన స్పీకర్‌

23
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో… గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్‌ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎల్.పి. సెక్రెటరీ మాదాడి రమేష్ రెడ్డి, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” బాధ్యులు రాఘవ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ… ఒక వ్యక్తి సమాజంలో స్పూర్తి నింపాలకున్నప్పుడు చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు పోతున్న వ్యక్తి సంతోష్‌కుమార్ అని అన్నారు. ఇంత గొప్ప ఆలోచనలను అమలు చేస్తాడు అనేందుకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఒక గొప్ప ఉదాహరణ అని అన్నారు.

వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ…సమాజంలో ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వాలే చేయాలే అనే ధోరణి నుంచి వ్యక్తులుగా కూడా సమాజానికి మంచి చేయవచ్చని నిరూపించిన వ్యక్తి…సంతోష్‌కుమార్‌. అనితరసాధ్యమైన కార్యక్రమం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ అని అన్నారు. ఆ మధ్య నేను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి కమ్యూనిటీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక భాగంలా కనిపించడం నన్ను అమితంగా ఆకర్షించిందన్నారు.

మహమూద్ అలీ మాట్లాడుతూ…మనుషులు బ్రతకడం కోసం మాత్రమే ఈ భూమి ఉందన్నట్టు వ్యవహరిస్తున్న అనాగరికమైన ఆలోచనలను తుంచేసిన అద్భుతం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అన్నారు

జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ…ఎవరైనా ఒక కార్యక్రమంను ఒకటి రెండు సంవత్సరాల్లో ముగిస్తారు. కానీ ఎంపీ సంతోష్‌కుమార్‌ సంకల్ప బలం చేత అవిశ్రాంతంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…ప్రపంచంలో ప్రతి శిఖరం మీద “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” స్పూర్తి పతాకం ఉండటం సాధారణ విషయం కాదు. ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సంతోష్ కుమార్ నా అభినందనలు అన్నారు.

మల్లారెడ్డి మాట్లాడుతూ…ఇవ్వాల ట్విట్టర్ల, ఫేసుబుక్ లో, ఇన్ స్ట్రాగ్రాంలో ఎక్కడ చూసినా ఏదో ఒకచోట మొక్కలు నాటిన వ్యక్తుల తాలూకు ఫోటోలు కనిపిస్తుండటం నాకు చాలా సంతోషం కలిగిస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి…

కవిత..ఆలయంలో ప్రత్యేక పూజలు

లడ్ఢాఖ్‌లో లిథియం నిల్వలు…

పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాం: కేసీఆర్

- Advertisement -