నడుము నొప్పిని మాయం చేసే ‘ఉత్కటాసనం’!

79
- Advertisement -

నడుము నొప్పి అనేది చాలమందిని వేదించే ఒక సాధారణ సమస్య.. అధిక బరువులు ఎత్తినప్పుడు లేదా నిరంతరం కూర్చిని వర్క్ చేయడం వంటివి చేసినప్పుడు.. ఇలా ఆయా సందర్భాలలో నడుము నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే నడుము నొప్పిని తగ్గించుకోవాడానికి డాక్టర్ల సూచనల మేరకు మెడిసన్స్ వాడుతూ ఉంటాము.. అలా కాకుండా మార్కెట్ లో దొరికే పెయిన్ కిల్లర్స్ వేసుకొని అప్పటికప్పుడు నడుము నొప్పితో విముక్తి పొందుతూ ఉంటాము..

అయితే ఈ నడుము నొప్పికి యోగా లో ‘ ఉత్కటాసనం ‘ ద్వారా చక్కటి పరిష్కారం లబిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనం ద్వారా నడుము నొప్పి తగ్గడంతో పాటు శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుందట. అంతే కాకుండా మోకాళ్ళ నొప్పులు ఉన్న కూడా ‘ ఉత్కటాసనం ‘ ద్వారా విముక్తి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వేయడం ద్వారా నడుము నుంచి అరికాలు వరకు కండరాలు పటిష్టంగా తయారవుతాయి. అందువల్ల అన్నీ రకాల నౌడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి వంటి సమస్యలకు ‘ ఉత్కటాసనం ‘ ద్వారా చెక్ పెట్టవచ్చిని నిపుణులు చెబుతున్నారు.

ఉత్కటాసనం వేయు విధానం

ముందుగా నిటారుగా నిలబడి నడుము భాగాన్ని వెనక్కి తీసుకెళ్లాలి. ఇలా చేసినప్పుడు మోకాళ్ళు భూమికి 90 డిగ్రీస్ కోణంలో ఉండాలి. ఆ తరువాత భుజాలను పైకి లేపకుండా చేతులను మాత్రమే పైకి చాచి.. మన దృష్టి చేతులపై ఉంచాలి. ఇలా 30-40 సెకన్ల పాటు ఉండాలి. ఆ తరువాత పరివృత్త ఉత్కతాసనం భంగిమలోకి రావాలి.. ఇందుకుగాను పైకి ఎత్తిన చేతులను మోకాళ్ళ వద్దకు తేవాలి. ఎడమ మోచేతిని కుడి మోకాలుకు ఆనించి దండం పెడుతూ.. కుడి మోచేతి చూస్తూ దృష్టి కేంద్రీకరించాలి.. అదే రెండవ వైపు కూడా చేయాలి.

Also Read:అంగరంగ వైభవంగా ‘పారిజాత పర్వం’ ప్రీరిలీజ్

- Advertisement -