వీటిని కలిపి తింటే ప్రమాదమే !

8
Foods rich in protein
- Advertisement -

భోజన ప్రియులు వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు కనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా లొట్టలేసుకుంటూ తినేస్తారు. కొన్ని సందర్భాల్లో రకరకాల ఆహార పదార్థాలన్ని కలగలిపి ఒకేసారి తింటూ ఉంటారు. ఇలా కాంబినేషన్ లో ఆహార పదార్థాలను తినే విషయంలో కొంత జాగ్రత్త వహించాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు వేరే ఇతర ఆహార పదార్థాలతో కలిసినప్పుడు శరీరంలో దుష్ప్రభావం చూపించే అవకాశం ఉందట. మరి అలాంటి ఆహార పదార్థాలు ఎంతో తెలుసుకుందామా !

పాలు-మాంసం
శరీరానికి అత్యధిక ప్రోటీన్ అందించే ఆహార పదార్థాలలో పాలు మాంసం ముందు వరుసలో ఉంటాయి. శాఖాహారులకు పాలు ప్రధాన ప్రోటీన్ వనరు. ఇక మాంసాహారులకు చికెన్, మటన్, చేపలు.. ఇలా చాలానే ప్రోటీన్ పదార్థాలు ఉన్నాయి. అయితే ఈ రెండిటిని కలిపి తింటే జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. మాంసాహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీనికితోడు పాలు కలిస్తే అజీర్తి వాంతులు ఏర్పడే అవకాశం ఉందట.

టీ-పెరుగు
సాధారణంగా చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే టీ తాగిన తర్వాత పెరుగు ఏ మాత్రం తాగరాదు. ఎందుకంటే టీలో ఉండే కెఫీన్ పెరుగులో ఉండే యాసిడ్స్ రెండు కూడా మిళితం కావు. తద్వారా కడుపు నొప్పి, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

పాలు నిమ్మరసం
చాలమంది పాలు నిమ్మరసం కలిపి తాగితే ఆరోగ్యనికి మేలని భావిస్తూ ఉంటారు. ఇది కొంత వాస్తవమే అయినప్పటికి ఇదే కాంబినేషన్ తరచూ చేస్తే జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుందని నిపుణులు చెబుతున్నారు.

పెరుగు అరటిపండు
రుచికరమైన భోజనం చేసేటప్పుడు చివర్లో పెరుగుతో తిని భోజనాన్ని కంప్లీట్ చేస్తుంటాము. ఆ వెంటనే అరటిపండు తినే అలవాటు ఉంటుంది చాలమందికి. ఇలా పెరుగు అరటిపండు వెంటవెంటనే తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందట.

కాబట్టి మనం తినే ఆహార పదార్థాలలో వీటి కాంబినేషన్స్ కు దూరంగా ఉండడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతో కేసీఆర్

- Advertisement -