బుల్లి తెర నుంచి వెండితెర మీదకు వచ్చి సక్సెస్ ఆయన అతి కొద్దిమంది హీరోయిన్స్‌లో కలర్స్ స్వాతి ఒకరు. ‘అష్టా చెమ్మ’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన స్వాతి ఆ చిత్రంతో ఉత్తమనటిగా ఫిలిం ఫేర్, నంది అవార్డులను గెలుచుకుని అందరి దృష్టినీ ఆకర్షించి వరుస ఛాన్సులు దక్కించుకుంది. అలా తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో వరుస అవకాశాలతో ఒక వెలుగు వెలిగిన స్వాతి 2015లో వచ్చి పరాజయం పొందిన ‘త్రిపుర’ చిత్రం తర్వాత తెరమీద కనిపించడం మానేసింది.
తాజాగా చాలా రోజుల తర్వాత ఓ తెలుగు సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది ఈ చిన్నది. ఆదిత్య అనే కొత్త దర్శకుడితో ‘గుంటూరు టాకీస్’ హీరో సిద్ధు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో స్వాతి కథానాయికగా అవకాశం దక్కించుకుంది. అందివచ్చిన ఈ అవకాశాన్ని వదులుకునేందుకు సిద్దమైంది స్వాతి.
అయితే, స్వాతి ఈ సినిమాను వదులుకోవడానికి పెద్ద కారణమే ఉంది. మితిమీరిన శృంగారం ఉండటమే కాకుండా హాట్ సీన్స్‌కు కొదువే లేదట. గతంలో టాలీవుడ్‌లో ఎన్నడూ లేనంతగా తెరమీద రెచ్చిపోవాలని దర్శక,నిర్మాతలు సూచించారట.
దీంతో తొలుత చాలా రోజుల తర్వాత అవకాశం దక్కిందని సంతోష పడ్డ స్వాతి … తర్వాత ఈ సినిమాలో చేయకపోవడమే మేలని భావించిందట. అలాంటి పాత్రలు ఎంపిక చేసుకుంటే బంగారం లాంటి కెరీర్ గంగపాలు కావడం ఖాయమని సన్నిహితులు కూడా హెచ్చరించారట.అంతే నా వల్ల కాదు బాబోయ్ అని నిర్మాత ముఖం మీదే చెప్పేసిందట స్వాతి. తమిళ, మలయాళ భాషల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు వెతుక్కొంటూ వస్తుంటే ఇక్కడ హాట్ సీన్స్ చేయాల్సిన ఖర్మ పట్టలేదని దర్శకుడికి చెప్పేసిందట స్వాతి.