నేతాజీ చంద్రబోస్‌పై వెబ్ సిరీస్..

302
Kabir Khan to make web series on Nethaji
- Advertisement -

పరాయిపాలనలో మగ్గుతున్న భారతమాతకు విముక్తి కల్పించడానికి ఎందరో వీరులు పోరాటయోధులుగా మారారు. ప్రాణాలకు తెగించి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టారు. అలాంటి వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ది ప్రత్యేక స్థానమనే విషయం అందరికీ తెలిసిందే. ధైర్యానికి, సాహసానికా ప్రతీక అయిన నేతాజీ బతికున్నారా? మరణించారా? అన్నదానిపై నేటికీ సస్పెన్స్ నెలకొని ఉంది.

ఈ నేపథ్యంలో చంద్రబోస్‌పై వెబ్‌ సిరీస్‌ తీయనున్నట్లు ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు కబీర్‌ ఖాన్‌ ప్రకటించారు. ది ఫర్‌గాటెన్‌ ఆర్మీ పేరుతో తీయనున్న ఈ సిరీస్‌లో నేతాజీతో పాటు.. భారత స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటాలను చూపిస్తామని తెలిపారు. ఎంతోమందిని ప్రభావితం చేసిన ఆనాటి ఆర్మీ చర్యలను.. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నేతలు ఎంచుకున్న మార్గాలను అన్నింటినీ తెరకెక్కిస్తామన్నారు.

Kabir Khan to make web series on Nethaji

అంతర్జాతీయ స్థాయిలో తీసే ఈ వెబ్‌ సిరీస్‌ను ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌’లో ప్రసారం చేస్తామని కబీర్‌ ఖాన్‌ వెల్లడించారు. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌తో ట్యూబ్ లైట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కబీర్  ఖాన్ ఆ తర్వాత నేతాజీపై వెబ్ సిరీస్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.

జై జవాన్ అంటూ స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23న కటక్ లో జన్మించారు. బ్రిటిష్ వాళ్ళిచ్చిన ఉన్నత పదవిని తిరస్కరించి, లండన్ నుండి స్వదేశానికి వచ్చి, తన రాజకీయ గురువైన చిత్తరంజన్ దాస్ నాయకత్వంలో స్వాతంత్య్రోద్యమంలో చేరారు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు సుభాష్ చంద్రబోస్.

1938, 1939 లలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా బోస్ ఎన్నికయ్యారు. 1942 జనవరి 26న ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో భారత దేశ తొలి స్వతంత్ర జాతీయ సైన్యాన్ని రూపొందించారు. ఆజాద్ హింద్ రేడియో కేంద్రాన్ని బెర్లిన్ లో ప్రారంభించిన నేతాజీ.. జపాన్ మొదలైన దేశాల్లో కూడా ఆయా రాజ్యనేతలను, ప్రధాన మంత్రులను ప్రభావితం చేయగలిగారు.

Kabir Khan to make web series on Nethaji

తప్పని పరిస్థితుల్లో ఆజాద్ హింద్ ఫౌజ్ యుద్ధ కార్యక్రమాలను నిలిపివేసి, సింగపూర్ కు వెళ్లిన ఆయన.. సివిల్ మిలిటరీ అధికారులతో భవిష్యత్తు గురించి చర్చించి, అందరూ సింగపూర్ ను వదిలిపోవాలనే నిర్ణయం తీసుకున్నారు. నేతాజీ సైగాన్ చేరి అక్కడ నుంచి ఆగస్టు 17న ఒక ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్లారు, ఏమయ్యారు అన్నది మిస్టరీగా ఉండిపోయింది.

1945 ఆగస్టు 22న టోక్యో రేడియో నుంచి ఒక వార్త వెలువడింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆగస్టు 18న విమాన ప్రమాదంలో మరణించారు అని. ఆ వార్తని నేతాజీ అభిమానులు ఎవరూ నమ్మలేదు. నేటికీ నేతాజీ అదృశ్యం ఒక మిస్టరీగానే మిగిలింది.

- Advertisement -