గ్లామర్ డోస్ పెంచిన రితిక సింగ్

15
- Advertisement -

దాదాపు దశాబ్ద కాలంగా వెండితెర మీద కొనసాగుతున్నా.. స్టార్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకోలేకపోతుంది రితిక సింగ్. అందుకే… ట్రెండ్ మార్చి డిజిటల్ ఆడియన్స్‌కు చేరువయ్యేందుకు రితిక సింగ్ కష్టపడుతుంది. పెద్దగా అప్‌డేట్స్‌ లేకపోవటంతో మీడియా అటెన్షన్‌ను గ్రాబ్ చేసేందుకు గ్లామర్‌ షోతో రచ్చ చేస్తోంది. సిల్వర్ స్క్రీన్ మీద బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం టెంపరేయర్‌ రెయిజ్‌ చేస్తూ రితిక సింగ్ రెచ్చిపోతుంది.

వరుస ఫోటో షూట్‌లతో హల్ చేస్తున్న రితిక సింగ్, ఇప్పుడు హాట్‌నెస్‌ ఓవర్‌ లోడెడ్ అన్న రేంజ్‌లో రెచ్చిపోయింది. మూవీ అప్‌డేట్స్‌తో న్యూస్‌లో కనిపించకపోయినా… గ్లామర్ అప్‌డేట్స్‌తో మాత్రం గట్టిగానే సందడి చేస్తోంది. నటిగా రొటీన్‌ మోడ్రన్‌ గర్ల క్యారెక్టర్స్ మాత్రమే వస్తుండటంతో సోషల్ మీడియాలో వేరియేషన్స్ చూపిస్తోంది రితిక. తాజాగా ఈ బ్యూటీ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అల్ట్రా మోడ్రన్‌గా టూ హాట్ అనిపించే రేంజ్‌లో కెమెరాల ముందుకు వచ్చింది రితిక సింగ్.

అయితే రితిక సింగ్ ఈ రేంజ్‌లో కష్టపడుతున్నా అనుకున్న రేంజ్‌లో ఆఫర్స్ అయితే రావటం లేదు. ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ. హిందీలో రెండు, తమిళ్‌లో రెండు ప్రాజెక్ట్స్‌ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి అని టాక్. రితిక సింగ్ గ్లామర్ షో, వెండితెర అవకాశాలకు హెల్ప్ అవ్వకపోయినా… డిజిటల్‌లో అయినా అవకాశాలు తెచ్చిపెడుతుందని నమ్ముతుంది.

ఇప్పటికే అజయ్ దేవగన్‌ లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న ఓ సినిమాలో రితిక సింగ్ నెగెటివ్‌ రోల్‌లో నటించబోతుంది. అన్నట్టు ఛాన్స్ ఇస్తే డిజటల్‌లో ప్రయోగాలకు రెడీ అంటున్నారు ఈ బ్యూటీ. మరి రితిక సింగ్ కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి.

Also Read:దిల్ రాజు …ష‌ర‌తులు వ‌ర్తిసాయి

- Advertisement -