ఆది..నీవెవరో రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా…

222
Neevevaro

ఆది పినిశెట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అకర్లేని పేరు. సరైనోడు సినిమాలో విలన్‌గా అలరించిన ఆది…నానితో నిన్నుకోరి సినిమాలో డిఫరెంట్ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. తాజాగా ఆది హీరోగా సొట్టబుగ్గల సుందరి తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటిస్తోన్న చిత్రం ‘నీవెవరో’ .న ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవలె సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ని కొర‌టాల శివ విడుదల చేయగా మంచిరెస్పాన్స్ వచ్చింది. లవ్‌తో పాటు సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఆది పినిశెట్టితో పాటు తాప్సీ ,రితికా సింగ్ కెరీర్‌లో సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం ఖాయమని తెలిపారు. ప్రధానమైన మూడు పాత్రలను చాలా వైవిధ్యభరితంగా తీర్చిదిద్దారట.ఇటీవలి కాలంలో తక్కువ బడ్జెట్ లో మంచి కంటెంట్ వున్న సినిమాలు వచ్చి భారీ విజయాలను అందుకున్నాయి.అలాంటి సినిమాల ఖాతాలోనే నీవెవరో నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది చిత్రయూనిట్.