ఐపీఎల్ ‌…. హ్యాట్రిక్ వీరులు

164
IPL - The hat trick takers

చూస్తుండగానే తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఎల్లలులేని క్రికెట్‌ మజాను అందించిన ఐపీఎల్‌ భారీ స్కోర్లతో పాటు చక్కటి బౌలింగ్ మజాను అందించింది.  కొన్ని టీమ్‌లు ఈ మెగా లీగ్‌పై చెరగని ముద్ర వేస్తే.. మరికొన్ని ఫ్రాంచైజీలు పేలవ ప్రదర్శనతో.. ఆర్థిక అవకతవకలతో.. నష్టాలతో తెరమరుగైపోయాయి. మొత్తానికి ఈ తొమ్మిదేళ్ల కాలంలో 13 జట్లు టైటిల్‌ కోసం పోటీపడగా వాటిలో ఆరు జట్లు మాత్రమే టైటిల్‌ను ముద్దాడాయి.

ఇక ఐపీఎల్‌ టీ 20 క్రికెట్లో సరికొత్త చరిత్రను సృష్టించగా వారిలో స్పిన్నర్ అమిత్ మిశ్రాది ప్రత్యేక స్దానం. ఇప్పటివరకు  జరిగిన ఐపీఎల్‌ లీగ్‌లో మూడు సార్లు హ్యాట్రిక్ సాధించిన బౌలర్‌గా నిలిచాడు మిశ్రా. 2008లో అప్పటి డక్కన్ చార్జర్స్ తరఫున ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను మూడు వరుస బంతుల్లో ద్వారకా రవితేజ, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓఝా వికెట్లను కూల్చాడు.

IPL - The hat trick takers

2011లోనూ డక్కన్ చార్జర్స్ తరఫున కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లలో ర్యాన్ మెక్‌లారెన్, మన్దీప్ సింగ్, ర్యాన్ హారిస్ వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. 2013లో  బుధవారం పుణే వారియర్స్‌పై సన్‌రైజర్స్ తరఫున ఆడుతూ భువనేశ్వర్ కుమార్, రాహుల్ శర్మ, అశోక్ దిండా వికెట్లను సాధించాడు.

మిశ్రా తర్వాతి స్ధానంలో ఆల్ రౌండర్ యువరాజ్ ప్రత్యేక స్ధానాన్ని సంపాదించాడు. ఒకే సీజన్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ సాధించిన బౌలర్‌గా యువీ రికార్డు సాధించాడు.  2009లో  యువీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, డక్కన్ చార్జర్స్ బెంగళూరు జట్లపై హ్యాట్రిక్స్ సాధించాడు. ఇక హ్యాట్రిక్ వీరుల్లో లక్ష్మీపతి బాలాజీ (2008లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై), మఖయా ఎన్తినీ (2008లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై), రోహిత్ శర్మ (2009లో ముంబయి ఇండియన్స్‌పై), ప్రవీణ్ కుమార్ 2010లో రాజస్థాన్ రాయల్స్‌పై), అజిత్ చండీలా (2012లో పుణె వారియర్స్‌పై), సునీల్ నారైన్ (2013లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై), ప్రవీణ్ తంబే (2014లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై), షేన్ వాట్సన్ (2014లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై), అక్షర్ పటేల్‌ 2016లో హ్యాట్రిక్ సాధించారు.