- Advertisement -
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలో వచ్చినప్పటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న మాన్ తాజాగా కొత్త గన్ లైసెన్స్‌ల జారీ రద్దుపై షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గన్‌లతో హింస పెరిగిపోతుండటంపై పంజాబ్ సర్కార్ అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుంది.
ఇకపై గన్ లైసెన్స్‌ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని… ఇప్పటికే జారీ చేసిన లైసెన్సుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు.అలాగే గన్‌లు బహిరంగంగా ప్రదర్శించడం నిషేధం. వేడుకల్లో గాలిలోకి కాల్పులు జరపడం కూడా నిషేధమే.
అలాగే అధికారులు ర్యాండమ్‌గా తనిఖీలు నిర్వహించనున్నారు. హింసను ప్రేరేపించే పాటలు, ప్రకటనలపై నిషేధంతో పాటు మతాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిన వారిపై చర్యలు తీసుకోనున్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి చరిత్రలో రికార్డు..
ఈ నెల 15న టీఆర్‌ఎస్‌ఎల్పీ మీటింగ్
త్వరలో మహబూబాబాద్‌కు సీఎం..
- Advertisement -