పీఎంను అగౌర పరిచిన పంజాబ్ సీఎంపై చర్యలు తీసుకోవాలి..

23

ఇటీవల పంజాబ్‌లో ప్రధాని మోడీపై జరిగిన కుట్రకు వ్యతిరేకంగా గుంటూరులో బీజేపీ పార్టీ నిరసన ప్రదర్శనలు చేసింది. ఈ మేరకు ఈరోజు గాంధీ విగ్రహం వద్ద బీజేపీ మౌన దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో బీజేపీ నేతలు కన్నా లక్ష్మి నారాయణ, జూపూడి రంగరాజు, చందు సాంబశివరావు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోదీపై కుట్రపూరితంగా పంజాబ్ ప్రబుత్వం వ్యవహరించిందని అన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి వెళ్ళిన పీఎంకు రక్షణ ఇవ్వకుండా నడిరోడ్డుపై నిలిపి వేయడం దారుణం. సీఎం కాన్వాయిని ఉద్దేశ పూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది. ఇలాంటి ఘటన దేశంలో ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు. పంజాబ్ ఘటన దేశ ప్రతిష్టను మసక బార్చింది. ప్రధానిని అగౌర పరిచిన పంజాబ్ సీఎంపై చర్యలు తీసుకోవాలని కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్‌ చేశారు.