అన్‌స్టాపబుల్..అతిథిగా మరో మాజీ సీఎం!

194
nbk
- Advertisement -

ఆహా వేదికగా నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో అన్‌స్టాపబుల్ విత్ NBK. ఈ షోతో ఆహాకి రికార్డు వ్యూస్ వస్తుండగా సబ్‌స్ట్రైబర్స్‌ కూడా పెరిగారు. ఇక షో సెకండ్ సీజన్ తొలి ఎపిసోడ్‌కి టీడీపీ ఆధినేత, మాజీ సీఎం చంద్రబాబు రాగా తాజాగా మరో మాజీ సీఎం రానున్నట్లు సమాచారం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్‌ రెడ్డి రానున్నట్లు తెలుస్తోంది. అలాగే మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ కూడా హాజరవుతున్నట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ షూటింగ్ నవంబర్ 14న జరిగే అవకాశం ఉంది. షోకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

ఇక రెండవ ఎపిసోడ్ లో యువహీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ – మూడో ఎపిసోడ్‌ లో అడివి శేష్, శర్వానంద్ హాజరయ్యి బాలయ్యతో కలిసి సందడి చేశారు. తమ అభిమాన వ్యక్తుల జీవితాలు మరియు వారి జీవితంలో ఉన్న చీకటి కోణాన్ని బాలయ్య సరికొత్త రీతిలో అవిష్కిరిస్తుంటే.. అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -