ఉక్కుమనిషి జయంతి రోజున ఐక్యతా నివాళి

128
- Advertisement -

భారతదేశపు ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి అయిన అక్టోబర్‌31న జాతీయ ఐక్యతా దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర హోం మంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్-2022 కార్యక్రమాన్ని జరపాలని కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వారా జారీ చేశారు. కేంద్ర హోం మంత్రి స్పెషల్‌ ఆపరేషన్‌ మెడల్‌-2022లో భాగంగా ఈ సంవత్సరం రన్‌ ఫర్‌ యూనిటీని ప్రకటించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని రాష్ట్రాల పోలీసులు, కేంద్ర పాలిత పోలీసు బలగాలు, కేంద్ర పోలీసు బలగాలు పాల్గొననున్నాయి.

ఉగ్రవాదం, సరిహద్దు చర్యలు, ఆయుధాల నియంత్రణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధం, మరియు రెస్క్యూ ఆపరేషన్స్‌ వంటి విభాగాల్లో ప్రత్యేక దళాల్లో పనిచేసిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

ఇది అసాధారణమైన పరిస్థితులల్లో పనిచేసిన కేంద్రబలగాలు, రాష్ట్రాల పోలీసులు, కేంద్రపాలిత ప్రాంత పోలీసులను ప్రోత్సహించడానికి ఈ ఐదు ప్రత్యేక కార్యకలాపాలల్లో పాల్గొన్నవారికి ఈ అవార్డు ఇవ్వబడుతుందని ప్రకటించారు. దీనిలో విజేతలైన ప్రతి విజేతకు మెడల్‌తో పాటు కేంద్రహోం మంత్రి సంతకంతో కూడిన సర్టిఫికేట్ (స్క్రోల్)ను ప్రదానం చేయనున్నారు.

ఈ అవార్డు ఎంపిక కమిటీలో డైరెక్టర్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో హోం సెక్రటరీ అధ్యక్షతన ఎంపిక చేస్తుందని హోం మంత్రిత్వశాఖ ప్రకటన జారీ చేసింది. దీనిలో రాష్ట్రాలు మరియు కేంద్రప్రాంతాలకు చెందిన ఇద్దరు డైరెక్టర్‌ జనరల్‌లు మరియు రోటేషన్‌ పద్దతిలో సీఏపీఎఫ్‌ యొక్క ఒక డైరెక్టర్‌ జనరల్‌ ఉంటారు. వీరు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటారని ప్రకటనలో పేర్కొన్నారు. కమిటీ సిఫార్సు చేసిన అవార్డు గ్రహీత తుది జాబితాను కేంద్ర హోంమంత్రి అమోదం తెలపనున్నారు.

ఇవి కూడా చదవండి..

సమంతకు అరుదైన వ్యాధి

ప్రజలు కోరితే రాజాకీయాల్లోకి వస్తా:కంగనా

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మళ్లీ యాక్సిడెంట్

- Advertisement -