టాలీవుడ్ మీల్క్ బాయ్‌గా పేరు పొందిన సూపర్ స్టార్ మహేశ్ సరికొత్త లుక్‌లో దర్శనిమచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా గర్ల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరో…తాజాగా గుబురు గడ్డంతో షర్ట్ లేకుండా తొలిసారి కనిపించి షాక్ ఇచ్చారు. ఈ ఫోటోలను స్వయంగా మహేశ్ బాబు భార్య నమ్రతశిరోద్కర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తను నటించిన సినిమాల్లో కూడా షర్టు లేకుండా కనిపించాలని డైరెక్టర్‌లు ఎంత కోరినా సున్నితంగా తిరస్కరిస్తారు.
మహేశ్, సుకుమార్ కాంబీనేషన్‌లో వచ్చిన వన్ సినిమాలో కూడా షర్ట్ లేకుండా నటించాడానికి ప్రయత్నించారు. ఇటీవలి కాలంలో తన లుక్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 అనే ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నట్లు టాలీవుడ్ టాక్. తాజాగా స్విమ్మింగ్ పూల్లో మహేశ్ షర్ట్ లేకుండా కనిపించిన ఫోటోలను షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.