సీపీఐ మద్ధతు టీఆర్ఎస్‌కే : చాడ

76
chada
- Advertisement -

బీజేపీని ఓడించే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌తో కలిసి సీపీఐ పని చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తాము టీఆర్‌ఎస్‌కు మద్ధతు ఇస్తున్నామని తెలిపారు. బీజేపీని ఓడించడమే సీపీఐ లక్ష్యమని… ఇది జాతీయ పార్టీ తీర్మానంలో ఉందని…దీని కోసం సీపీఐ అన్ని ప్రాంతీయ పార్టీలతో కలసి పనిచేస్తుందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికపై హైదరాబాద్‌లోని పార్టీప్రధాన కార్యలయంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో సీపీఐ నిలబడే పరిస్థితి లేదని చేప్పారు. అందుకే టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నామని తెలిపిన ఆయన బీజేపీని ఓడించే సత్తా కేవలం టీఆర్ఎస్‌కే ఉందన్నారు. మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్‌ఎస్‌తో బంధం ముగియదు, భవిష్యత్‌లో జరిగే అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు ఉంటుందని తెలిపారు. ఇందుకోసం బీజేపీని ఓడించేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో కార్యాచరణను రూపొందిస్తున్నమన్నారు. మునుగోడు బహిరంగ సభకు రావాలని సీఎం కేసీఆర్‌ తమను ఆహ్వానించారని చెప్పారు. సీపీఐ నేతలు ఈ బహిరంగ సభలో పాల్గోంటారని అన్నారు. రాజగోపాల్‌రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. 2018లో కాంగ్రేస్‌తో పోత్తు సమయంలో మమ్మల్ని ఇబ్బంది పడ్డామని తెలిపారు. తమకు కేటాయించిన సీట్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు కూడా పోటీ చేశారని ఆగ్రహం వ్యక్తం చెశారు.

- Advertisement -