నీరు లేని నేల ఎడారిగా మారుతుందని….నేలకు అవసరమైన నీరు వర్షాధారమే అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. సద్గురు ఈష ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన నిరంజన్ రెడ్డి…వర్షాధారం నుండి వచ్చిన నీటిని నిలువ ఉంచుకుని సముద్రంలో కలిసే నీళ్లను ఎక్కడికక్కడ ఒడిసిపట్టి చెరువులు, కుంటలు, వాగులు , వంకలు, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా ఈ రోజు తెలంగాణ నేల భూగర్భ జలాలను పెంచడంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
ఇవాళ తెలంగాణలో ఎక్కడ చూసినా నీటి సంపద .. తెలంగాణ నేల అంతా పచ్చబడ్డదన్నారు. తెలంగాణలో పశువులు, గొర్ల సంపద పెరిగింది .. 2019 లెక్కల ప్రకారం 3.26 కోట్ల జీవాలు ఉన్నయ్ అన్నారు. రాబోయే తరాల కోసం ఈ నేలను కాపాడుకోవడం ద్వారా ఆహార భద్రతను, పర్యావరణ భద్రతను కాపాడుకోవడం జరుగుతుందన్నారు. జీవనం అంటే మనుషులే కాదు .. అన్ని రకాల జీవులతో మనకు సంబంధం ఉంది .. మనం గాలి పీలుస్తున్నాం, అవి పీలుస్తున్నాం .. అవి జీవించాలి, మనం జీవించాలన్నారు.
కారుణ్యమైన భావనతో ఈ భూమి మీద సమస్త జీవరాశులన్నీ జీవించాలనే భావనతో , సిద్దాంతంతో భావి తరాలకు అందించాలనే సందేశంతో ముందుకు వెళ్తున్న సంస్థకు అభినందనలు .. దానిని మనందరం ఆచరించాలన్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఈ సంస్థకు అనుబంధంగా ఉండి తోడ్పడుతాం…మనం తినే ఆహారంలో పరిమితికి మించిన రసాయనాలు ఉన్నాయన్నారు. అందుకే 2015 సెప్టెంబరులో యూఎన్ఓ సూచించిన అంశాల కంటే ముందుగానే ఎంతో ముందుచూపుతో తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ తొలి క్యాబినెట్ లోనే ఈ దిశగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని గుర్తుచేశారు.