భాగ్యనగరంలో పలు చోట్ల భారీ వర్షం..

40
- Advertisement -

గత రెండు రోజులుగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరుగా వానలు కురుస్తున్నాయి. నగరంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మీర్‌పేట్‌, అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్ పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. ఈరోజు ఉదయం నాంపల్లి, బషీర్‌బాగ్‌, అబిడ్స్‌, కోఠి, బేగంపేట, సుల్తాన్‌బజార్‌, కాచిగూడ, అంబర్‌పేట, గోల్నాకతోపాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

- Advertisement -