ఏటీఎంలను మరిచిపోండిక..!

311
Bigger role for RBI
- Advertisement -

పెద్ద నోట్ల రద్దు తర్వాత ఫిబ్రవరి నెల నుంచి కాస్త సడలింపు వచ్చినప్పటికీ బ్యాంకుల్లో మళ్లీ డబ్బు నిండుకోవడంతో బెంబేలెత్తిపోయిన జనాలకు మాడు పగులకొడుతూ రిజర్వ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయాలు పిడుగుపాటుకు గురిచేస్తున్నాయి. నోట్ల రద్దు అనంతరం నవంబర్‌ పదో తేదీ తరువాత నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి సుమారు 1,500 ఏటీఎంలు తెరుచుకోనేలేదు. మరో వెయ్యి ఏటీఎంలు పనిచేస్తున్నా… కేవలం బ్యాలెన్స్‌ తెలుసుకోవడం, క్రెడిట్‌కార్డు, ఇతర బిల్లులు చెల్లించడం వంటి సేవలకే పరిమితం అవుతున్నాయి. దీంతో కరెన్సీ దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Bigger role for RBI

రానున్న రోజుల్లో మరింత తీవ్రం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఇటీవలే నగదు విత్ డ్రా పరిమితులను సడలించినా.. గత పక్షం రోజుల నుంచి మళ్లీ ఏటీఎం కష్టాలు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. చాలా ఏటీఎంలలో నగదు ఉండటం లేదు. దీంతో ఖాతాదారులు తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతున్నారు.

దీనికి తోడు వీలైనంత మేరకు ఏటీఎం కేంద్రాలను కుదించుకోవాలని, అవసరం లేని చోట్ల మూసి వేయాలని రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులను ఆదేశించింది. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చేదాకా ఏటీఎంల్లో నగదును నింపవద్దని, కొన్ని ఏటీఎంలలో మాత్రమే పరిమితంగా నగదు ఉంచాలని ఫిబ్రవరి రెండో వారంలోనే సూచించినట్లు సమాచారం. అందువల్లే ఫిబ్రవరి చివరి వారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం ఏటీఎంలు పనిచేయడం మానేశాయి. అక్కడక్కడా ఏటీఎంలలో నగదు పరిమితంగా లోడ్‌ చేస్తుండటంతో గంటలోపే ఖాళీ అవుతున్నాయి.

ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంటే ప్రజలు క్యాష్ ట్రాన్సాక్షన్లకు వెళ్తున్నారు, ఏటీఎంలలో డ్రాకు అవకాశం లేకుండా పోతే తప్పనిసరిగా డిజిటల్ ట్రాన్సాక్షన్లకు వెళ్తారనేది ఆర్బీఐ థియరీగా తెలుస్తోంది. అందుకే కావాలనే ఏటీఎంలలో క్యాష్ కొరతను సృష్టిస్తున్నారని సమాచారం.అంతే కాదు.. ఇకపై ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా విషయంలో మరిన్ని పరిమితులు రానున్నాయని కూడా తెలుస్తోంది. రోజుకు ఏటీఎం కార్డు ద్వారా కేవలం పది వేల రూపాయలే డ్రా చేసుకోవాలనే పరిమితిని ఉంచనుందట ఆర్ బీఐ.

Bigger role for RBI

అంతకు మించి క్యాష్ డ్రా చేసుకోవాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే, లేదా డిజిటల్ ట్రాన్సాక్షన్లకు వెళ్లాల్సిందే. బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేసుకోవానికి ఇప్పటికే పలు పరిమితులను పెట్టారు. ఎక్కువ సార్లు బ్యాంకుకు వెళితే అదనపు చార్జీలు చెల్లించాలి. ఇలా రెండు వైపుల నుంచి నియంత్రణలు అమలు చేస్తూ.. ఖాతాదారులను డిజిటల్ ట్రాన్సాక్షన్ల వైపు మళ్లించే వ్యూహాన్ని అమల్లో పెడుతోంది ఆర్బీఐ. దీంతో రానున్న కాలంలో ఖాతాదారులు ఏటీఎంలను మర్చిపోవాల్సిన పరిస్ధితి వస్తుందని భావిస్తున్నారు నిపుణులు.

- Advertisement -