వెంకీ … గురు క్లీన్ ‘యు’

142
venkatesh guru gets Clean U

విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం గురు.రిపబ్లిక్ డే నాటికే రిలీజ్ అవుతుందని భావించిన ఈ చిత్రం.. అనుకోకుండా వాయిదా పడి.. ఎట్టకేలకు తియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. రిలీజ్ ఫార్మాలిటీస్ ను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటున్న గురు.. ఇప్పుడు సెన్సార్ అడ్డంకిని కూడా దాటేసింది.

సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ U సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన గురు.. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన సాలా ఖడూస్ రీమేక్ అనే సంగతి తెలిసిందే. వెంకటేశ్ ఈ సినిమాలో కొత్త లుక్ తో కనిపించనున్నాడు. బాక్సింగ్ కోచ్ పాత్రను ఆయన పోషించగా, ఆయన శిష్యురాలిగా రితికా సింగ్ కనిపించనుంది.

తాజాగా విడుదలైన ట్రైలర్ కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఉగాది పండుగ కానుకగా మార్చ్ 31నే విడుదల చేస్తున్నారు. అందుకే ఇప్పుడు సెన్సార్ ఫార్మాలిటీస్ ను కంప్లీట్ చేసింది గురు యూనిట్. ఈ కథతో రూపొందిన తమిళ .. హిందీ సినిమాలు విజయవంతం కాగా, తెలుగుపై కూడా అందరిలో ఆసక్తి వుంది. తన కెరియర్లో చెప్పికోదగిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందనే నమ్మకంతో వెంకటేశ్ వున్నాడు. ఆ నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.