కరెన్సీ కష్టాలు…జైట్లీ ట్వీట్‌కు కేటీఆర్ రీట్వీట్

230
Ktr Tweets to Arun Jaitly
- Advertisement -

నవంబర్ 8 కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికి దేశవ్యాప్తంగా బ్యాంకులు,ఏటీఎంలలో డబ్బులు లేని పరిస్ధితి నెలకొంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఝార్ఖండ్, గుజరాత్‌తో పాటు చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు, ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అంతేగాదు పలు రాష్ట్రాల నుంచి రిజర్వు బ్యాంకుకు, ప్రభుత్వానికి నగదు కొరతపై ఫిర్యాదులు అందుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. దేశంలో సరిపడినంత నగదు చలమణిలో ఉందని,బ్యాంకుల వద్ద డబ్బు అందుబాటులో ఉందని జైట్లీ ట్వీట్ చేశారు. జైట్లీ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్ మూడు నెలలుగా హైదరాబాద్‌లో నగదు కొరతపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.

ఇది ఆకస్మికంగానో లేక తాత్కాలికంగానో వచ్చింది కాదని తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని క్రమంగా వమ్ము చేస్తోన్న సమస్యపై ఆర్‌బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ లోతుగా పరిశీలించాలని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిగా ఉదహరణ అంటూ  ఏటీఎం సెంటర్ల వద్ద నో క్యాష్ అంటూ  దర్శనమిస్తున్న పలు బ్యాంకుల ఫోటోలను షేర్ చేశారు కేటీఆర్.

- Advertisement -