బ్యాంకులు బంద్‌..

236
Bank strike
- Advertisement -

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల బంద్ కు పిలుపునిచ్చారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కేవలం 2శాతమే వేతన పెంపును ఆఫర్ చేయడాన్ని నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు తాజాగా బంద్ కు దిగారు. మే 30 – 31న సమ్మెలోకి వెళుతుండడంతో ఈరెండు రోజులు బ్యాంకులు మూతపడబోతున్నాయి. నెలాఖరు కావడం.. ఉద్యోగుల వేతనాలు కూడా ఈరోజుల్లోనే క్రిడిట్ అయ్యే అవకాశం ఉండడంతో బంద్ ప్రభావం వేతన జీవులపై భారీగా పడబోతోంది.

Bank strike

బుధవారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు.. మొత్తం 48 గంటల పాటు సమ్మె జరగనుంది. బ్యాంకుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, కేవలం 2 శాతం వేతన పెంపు ప్రకటించి ఉద్యోగులను అవమానించిందని యూనియన్‌ నాయకులు కుమార్‌, నరేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు సిబ్బంది జాతీయ సంఘం(ఎన్‌వోబీడబ్ల్యూ) ఉపాధ్యక్షుడు అశ్విని రాణా దిల్లీలో మాట్లాడుతూ.. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్‌ బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొంటారని తెలిపారు.

Bank strike

బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో ప్రజల నగదు కష్టాలు మళ్లీ మొదలు కానున్నాయి. బ్యాంకులు పనిచేస్తున్న రోజుల్లో ఇప్పుడిప్పుడే ఏటీఎం కేంద్రాల్లో నగదు కనిపిస్తోంది. బ్యాంకు సెలవురోజుల్లో ఏటీఎంలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. రెండు రోజుల సమ్మెతో పరిస్థితి మొదటికి వచ్చే అవకాశముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జూన్‌ 1 నుంచి బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని బ్యాంకర్లు పేర్కొంటున్నారు.

- Advertisement -