సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ…

40
cm kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ జరగనుండగా యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. కేంద్రానికి కేసీఆర్ 24 గంటల డెడ్‌లైన్ విధించగా.. ధాన్యం సేకరణపై ఇవాళ స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ధాన్యం కొనుగోళ్లతో పాటు పంటకు మద్దతు ధర, పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినా.. ఆ తర్వాత దాన్ని ఏం చేయనుందనే ఉత్కంఠ నెలకొంది.

యాసంగిలో సుమారు 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుదని అంచనా వేయగా ఇందుకు ప్రత్యామ్నాయాలు ఏమిటన్న అంశంపై మంత్రులు, అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా సాధారణ బియ్యంగా మార్చిన పక్షంలో నూకలు ఎక్కువగా వస్తే క్వింటాల్‌కు రూ.170 నుంచి రూ.200 వరకు మిల్లర్లకు చెల్లించాలనే దానిపై కూడా చర్చించనున్నారు. అయితే కేబినెట్ భేటీ అనంతరం ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -