టైగర్ నాగేశ్వరరావు…మొదలెట్టాడు!

81
tiger nageshwarrao
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ తన కెరీర్‌లో చేస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది.

రవితేజ సరసన బాలీవుడ్‌ భామ నూపూర్‌ సనన్‌తో పాటు మరో హీరోయిన్‌గా గాయత్రి భరద్వాజ్‌ను ఎంపిక చేశారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను ఈ సోమవారం మొదలు పెట్టారు. చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా.. ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రీకరణను మొదలుపెట్టినట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

టైగర్ నాగేశ్వరరావు పీరియాడిక్ సినిమా. 1970వ దశకంలో దక్షిణ భారతదేశంలోనే పేరుమోసిన, సాహసోపేతమైన స్టువర్ట్పురం నాగేశ్వరరావు కథ. అక్కడ జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చిత్రం.దర్శకుడు వంశీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో రూపొందుతోంది.

- Advertisement -