ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో #RythubandhuKCR హ్యాష్ ట్యాగ్

125
rythu bandhu
- Advertisement -

“రైతుబంధు కేసీఆర్” #RythubandhuKCR అనే హ్యాష్ ట్యాగ్ ఇవ్వాళ సోషల్ మీడియాలో హోరెత్తింది. ట్విట్టర్ లో దేశవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించింది!తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి సీఎం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు ద్వారా గత నాలుగేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సాయం పంపిణీ ఈ రోజు రు.50 వేల కోట్లకు చేరుకుంది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల సంబరాలు మిన్నంటాయి. ఇంత భారీ మొత్తంలో రైతులకు ఆర్ధిక ప్రయోజనం చేకూర్చిన చరిత్ర, ఘనత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది. సీఎం కేసీఆర్ గారి మానసపుత్రిక రైతుబంధు అని.. రైతు సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రైతుల కోసం తీసుకొని వచ్చినందుకు కేసీఆర్ గారికి కృతఙ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అదే క్రమంలో రైతు సంక్షేమం, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ప్రతిపక్షాల వైఖరిని తూర్పారా పట్టడం జరిగింది. కేటీఆర్ ప్రసంగానికి నెటిజన్ల నుండి ట్విట్టర్లో భారీ ఎత్తున స్పందన లభించింది.

#RythubandhuKCR హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ఎన్నారైలు మొదలుకొని కొన్ని వేల మంది రైతుబంధు కార్యక్రమాన్ని, రైతు సంక్షేమం పట్ల కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రశంసిస్తూ ట్వీట్లు చేయడం జరిగింది. దీనితో దేశవ్యాప్తంగా ట్విట్టర్లో #RythubandhuKCR హ్యాష్ ట్యాగ్ మొదటి స్థానంలో నిలిచి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. గత యేడేండ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పురోగతిని ఈ సందర్భంగా నెటిజన్లు ప్రస్తావించడం జరిగింది. రైతుబంధు కార్యక్రమం దేశంలో రైతు సంక్షేమానికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

- Advertisement -