ఉప్పల్‌లో రైతుబంధు సంబురాలు..

19
rythu bandhu

ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ పరిధిలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. రైతుల కోసం ఆర్థికంగా అందజేస్తున్న సాయం నిధులను విడుదల చేసిన నేపథ్యం మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, టిఆర్ఎస్ నేతలు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. అనంతరం ట్రాక్టర్లతో డివిజన్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతీ అని కొనియాడారు.

దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ‘రైతుబంధు’ పేరిట రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, రైతుల్లో భరోసా కలిగిందని అన్నారు. 8వ విడతతో కలిపి ఒక్క రైతుబంధు పథకం కిందనే రైతులకు ఇచ్చిన డబ్బులు రూ.50 వేల కోట్లకు చేరాయని ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి తెలిపారు.